5జీ పై ఎయిర్‌టెల్, జియో చెరోమాట!
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో 5జీ ప్రారంభంపై టెలికాం దిగ్గజాలు ముఖేష్ అంబానీ, సునీల్ మిట్టల్ వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2020 కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇద్దరూ దేశీయంగా 5జీ ప్రవేశంపై భిన్న కాలాలను అంచనా వేశారు. రిలయన్స్ జియో అధినేత 2021, రెండో భాగంలో 5జీ టెక్నాలజీని తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేయగా, భారతీ ఎయిర్‌టెల్ అధిపతి 5జీకి ఇంకా రెండు, మూడూ […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో 5జీ ప్రారంభంపై టెలికాం దిగ్గజాలు ముఖేష్ అంబానీ, సునీల్ మిట్టల్ వేర్వేరు అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2020 కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇద్దరూ దేశీయంగా 5జీ ప్రవేశంపై భిన్న కాలాలను అంచనా వేశారు. రిలయన్స్ జియో అధినేత 2021, రెండో భాగంలో 5జీ టెక్నాలజీని తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేయగా, భారతీ ఎయిర్‌టెల్ అధిపతి 5జీకి ఇంకా రెండు, మూడూ సంవత్సరాలు పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘2021 రెండో భాగంలో జియో భారత్‌లో 5జీ విప్లవానికి మార్గ దర్శకత్వం వహిస్తుందని హామీ ఇస్తున్నాను. ఇది స్వదేశీయంగా అభివృద్ధి చెందిన నెట్‌వర్క్, హార్డ్‌వేర్, టెక్నాలజీ పరికరాల ద్వారా అభివృద్ధి చెందుతుంది.
5జీ టెక్నాలజీ తొందరగా అమలు చేసేందుకు విధానపరమైన అభివృద్ధి అవసరమని’ ముఖేష్ అంబానీ చెప్పారు. ముఖేష్ అంబానీ తర్వాత ఇదే కార్యక్రమంలో మాట్లాడిన సునీల్ మిట్టల్..దేశీయంగా 5జీ బ్రాడ్‌బ్యాండ్ రెండు మూడేళ్ల తర్వాతే సాధారణ దశకు చేరుకుంటుందని తెలిపారు. రాబోయే 5జీ నెట్‌వర్క్‌పై ఉత్సాహంగా ఉన్నామని, అయితే సాధారణ నెట్‌వర్క్ తరహాలో అందుబాటులోకి వచ్చేందుకు రెండు మూడేళ్ల సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం 5జీ నెట్‌వర్క్‌కు మారితే పరికరాల ధరలు తగ్గుతాయని, ముఖ్యంగా పరికరాలు సమృద్ధిగా లభిస్తాయని మిట్టల్ తెలిపారు. భారత్ రెండు మూడేళ్లలో 5జీ స్టాండర్డ్, 5జీ ఎకోసిస్టమ్ నుంచి ప్రయోజనాలను పొందేందుకు సిద్ధపడుతుందని ఆయన చెప్పారు.
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు 2జీ సేవల వద్ద ఉన్న సమయంలో జియో పూర్తిగా 4జీ సేవలతో రంగంలోకి ప్రవేశించింది. భారత్‌లో 30 కోట్ల మంది వరకు 2జీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్నారు. వీరికి తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌లను అందించేందుకు అత్యవసర విధాన చర్యలు అవసరమని ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది కరోనా ప్రభావంతో దేశీయంగా హై-స్పీడ్ 4జీ కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు డిజిటల్ విధానం వేగవంతమైంది. ఈ ఏడాది భారత్‌లో వర్క్ ఆన్‌లైన్‌లో జరిగింది. షాపింగ్, ఆరోగ్య సంరక్షణ, గేమ్స్ ఇలా అన్ని ఆన్‌లైన్‌లో కొనసాగాయి. తక్కువ వ్యవధిలో భారత్ ఆన్‌లైన్ విధానానికి మారిపోయిందని అంబానీ తెలిపారు. కాగా, భారత్‌లో ప్రస్తుతానికి 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించేందుకు అధికారికంగా తేదీలను ఖరారు చేయలేదు.