వలస కూలీలకు బాసట

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ విధించిన తర్వాత జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. చిన్నాచితకా వ్యాపారాలతో పాటు అంతర్జాతీయ విమానాల వరకూ ఆగిపోయాయి. ఆర్థికంగా ఉన్నవారికి మిగులు నిధులతో నెట్టుకొస్తున్నారు. కాని పొట్టకూటి కోసం జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు దాటొచ్చినవారికి నిలువ నీడ లేకుండా పోయింది. పనిచేసే చోట్లనో లేదో రోడ్ల పక్కన ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుని జీవించేవారి పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఏ రోజుకారోజు పని దొరికితే తప్ప పూట గడవని వారికి ఈ పది […]

Update: 2020-03-31 07:36 GMT

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ విధించిన తర్వాత జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. చిన్నాచితకా వ్యాపారాలతో పాటు అంతర్జాతీయ విమానాల వరకూ ఆగిపోయాయి. ఆర్థికంగా ఉన్నవారికి మిగులు నిధులతో నెట్టుకొస్తున్నారు. కాని పొట్టకూటి కోసం జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దులు దాటొచ్చినవారికి నిలువ నీడ లేకుండా పోయింది. పనిచేసే చోట్లనో లేదో రోడ్ల పక్కన ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుని జీవించేవారి పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఏ రోజుకారోజు పని దొరికితే తప్ప పూట గడవని వారికి ఈ పది రోజులు దినదినగండంగా గడిచాయి. వేల సంఖ్యలో ఇలాంటి వలస కూలీలు నడుచుకుంటూ సొంతూళ్లకు పయనమయ్యారు. బీహార్, కర్నాటక, ఉత్తరప్రదేశ్ వరకూ నడిచేవెళ్లేందుకు సిద్ధమయ్యి దారిమధ్యలో దాహంతోనో, ఆకలితోనో చనిపోతున్న వారున్నారు. ఎక్కడో ఒక చోట పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ఉంటూ దొరికింది తింటూ బతుకుతున్నారు. వీరికి సాయమందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది.

ఇన్ని రోజులు ఏ దాతలో, మానవతా హృదయంతోనో స్పందించిన పోలీసులో ఇచ్చిన ఆహారమే వాళ్ల కడుపు నింపుతూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ కాలంలో రాష్ట్రంలోని తెలుపు కార్డు కలిగిన వారందరికీ అదనంగా 12కిలోల బియ్యం, రూ.1,500 ఇవ్వాలని నిర్ణయించింది. అయితే వలస కార్మికుల ఆకలి కేకలు, వారి అవస్థలు పాలకుల చెవులకు వినిపించేలా చేయడంలో మీడీయా కీలక పాత్ర వహించిందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో వలస కూలీలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. నగరంలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల వలస కార్మికులందరికీ రేషన్ సరుకులు ఇచ్చేందుకు బల్దియా ఏర్పాట్లు చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా 3 లక్షల పై చిలుకు..

సుమారు తెలంగాణ రాష్రవ్యాప్తంగా 3,35,669 మంది వలస కార్మికులు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా బిల్డర్లు, ఇంజినీర్ల వద్ద ఉన్న కూలీల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. హైదరాబాద్‌లో 37 వేలు, రంగారెడ్డిలో 34 వేలు, మేడ్చ‌ల్‌లో 14 వేల మంది వలస కూలీలను గుర్తించారు. స్థానికంగా ఏర్పాటు చేసే కేంద్రాల ద్వారా సరకులు తీసుకోవాల్సి ఉంటుంది.

ఆధార్ ఉంటేనే సాయం..

లాక్‌డౌన్ సందర్భంలో కరోనా ప్రభావానికి కొత్తగా గురయ్యేవారిని నిరోధించడమే కాకుండా వలస కూలీల ఆకలి తీర్చేందుకు అవకాశం కలుగుతుందని బల్దియా అధికారులు చెబుతున్నారు.
ఆధార్ ఉంటేనే రేషన్
తెలంగాణ జిల్లాలకు చెందనివారికి మాత్రమే ఈ పథకం కింద సాయమందింస్తారు. రేషన్ బియ్యం, డబ్బులు అందించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 948 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. స్థానికంగా ఆర్డీఓ, ఎంఆర్ఓ ద్వారా ఉన్నవాటితో కలుపుకుంటే మొత్తం 1,100 వరకూ కేంద్రాలు ఉన్నాయి. ఆయా సర్కిళ్ల పరిధిలో రెవెన్యూ, పోలీసు, బల్దియా అధికారుల పర్యవేక్షణ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సాయం తీసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు నెంబర్‌ను ఇవ్వాలి. ఇతర రాష్ట్రాలకు చెందినవారికి మాత్రమే ఈ సాయమందించనున్నారు. తెలంగాణలో రేషన్ కార్డు కలిగిఉన్న వారు దీనికి అనర్హులు.

కార్మికులందరికీ సాయమందేలా ఏర్పాట్లు..

జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వలస కార్మికులందరికీ బియ్యం, డబ్బులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. టౌన్‌ ప్లానింగ్ విభాగం వద్ద ఉన్న కూలీల జాబితా ప్రకారం అందజేస్తున్నాం. వారితో పాటు ఇతర రంగాల్లో పనిచేసే వారికీ కూడా ఈ సాయాన్ని అందించేందుకు జీహెచ్ఎంసీ తరఫున ఏర్పాట్లు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఎవరైనా తమ ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసి బియ్యాన్ని తీసుకెళ్లొచ్చు. కూలీలు సిటీ దాటి వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

– ఎన్.యాదగిరి, అసిస్టెంట్ కమిషనర్, జీహెచ్ఎంసీ

క్షేత్రస్థాయిలో అందరికీ అందడం లేదు..

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణరంగ కార్మికులకు మాత్రమే రేషన్ సరుకులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. సెంటర్లు ఏర్పాటు చేసి బియ్యం, ఆహారం అందజేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కాని క్షేత్రస్థాయిలో అలా కనిపించడం లేదు. బిల్డర్లు రిజిస్ట్రర్ చేయకుండా కూడా కార్మికులతో పనిచేయించుకుంటున్నారు. వారికి ఎలాంటి సాయం ఆందడం లేదు. సరూర్ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో భవన నిర్మాణ రంగ కార్మికుల గురించి మేం ఆయా డిప్యూటీ కమిషనర్లకు సమాచారమందించాం. అయినా ఇప్పటివరకూ వారికెలాంటి సాయం అందడం లేదు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ బియ్యం, ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలి.

– కీసరి నర్సిరెడ్డి, సీఐటీయూ గ్రేటర్ నాయకులు

TAgs: corona, labour, meals, ghmc, GHMC, migrant workers

Tags:    

Similar News