కాంగ్రెస్‌లో చేరిక వేళ షర్మిలకు BIG షాక్.. సొంత నేత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో షర్మిల అంశం హాట్ టాపిక్‌గా మారింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో షర్మిల భేటీ కావడం పట్ల వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారేనే ఊహాగానాలు బలపడుతున్న తరుణంలో వైఎస్సార్ టీపీ నేత గట్టు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-09-01 10:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో షర్మిల అంశం హాట్ టాపిక్‌గా మారింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో షర్మిల భేటీ కావడం పట్ల వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారేనే ఊహాగానాలు బలపడుతున్న తరుణంలో వైఎస్సార్ టీపీ నేత గట్టు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్‌లో వైఎస్సార్ టీపీ విలీనంపై మాకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టీపీ విలీనం జీర్ణించుకోలేమని తెలిపారు. షర్మిల ఒక్కరే కాంగ్రెస్‌లోకి వెళ్తే అది చేరిక అవుతుందే తప్ప విలీనం కాదన్నారు. ఒక్కసారి పార్టీని స్థాపించి కమిటీలు ఏర్పాటు చేశాక అది ప్రజల పార్టీ అవుతుందన్నారు.

ఎంతో మంది తమ డబ్బులను ఖర్చు చేసి పార్టీ కోసం పని చేశారని ఇప్పుడు వారందనిరి వదిలేసి తానొక్కతే కాంగ్రెస్‌లో విలీనం అంటే క్యాడర్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 105 నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను ఏర్పాటు చేశామని వారంతా ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేస్తే తీరా షర్మిల కాంగ్రెస్‌లో చేరితే ఎలా అని ప్రశ్నించారు. వారందరిని కాంగ్రెస్‌లో ఎలా అకామిడేట్ చేయబోతున్నారని నిలదీశారు. క్యాడర్‌ను నడిరోడ్డుపై నిలబెడతామంటే సహించేది లేదని హెచ్చరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనే బండికి తెలుగు దేశానికి చెందిన డ్రైవర్ ఉన్నారని అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు షర్మిల రాకను ఆహ్వానిస్తుంటే రేవంత్ వర్గం వ్యతిరేకిస్తుందన్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల సారాంశం ఏంటి అనేది అటు కాంగ్రెస్ ఇటు షర్మిల చెప్పడం లేదని మండిపడ్డారు.

Tags:    

Similar News