ప్లీజ్ తిరిగిరండి.. పార్టీని వీడిన వారిని రిక్వెస్ట్ చేస్తున్న Y. S. Sharmila
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం లేకపోవడంతో నేతలను వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయాలని చూస్తోంది అధినేత్రి షర్మిల. అందులో భాగంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం లేకపోవడంతో నేతలను వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయాలని చూస్తోంది అధినేత్రి షర్మిల. అందులో భాగంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయిలో ఇప్పటివరకు వివిధ కారణాలతో పార్టీలో సస్పెన్షన్‌కు గురైన నాయకులను వైఎస్సార్ అభిమానులుగా గుర్తించి వారిపై ఉన్న సస్పెన్షన్ తొలగించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధినేత్రి షర్మిల ఆయా జిల్లాల అధ్యక్షులను, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లను ఆదేశించినట్లు లోటస్ పాండ్ వర్గీయులు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టీపీ విలీనానికి హస్తం నేతలు హ్యాండ్ ఇవ్వడంతో చేసేదేం లేక షర్మిల వచ్చే ఎన్నికలకు సింగిల్‌గానే పోటీ చేయాలని ఇటీవల ముఖ్య నేతల సమావేశంలో స్పష్టం చేశారు. 119 స్థానాల్లో తమ పార్టీ నుంచి బరిలోకి దిగుతామని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో సస్పెన్షన్‌తో పార్టీని వీడిన నేతలంతా తిరిగి రావాలని రిక్వెస్ట్ చేశారు. కొన్ని నెలలుగా పార్టీ యాక్టివిటీ లేకపోవడంతో నేతలు సైలెంట్ అయ్యారు. దానికి తోడు విలీనం చేస్తాననడంతో ఉన్న కొద్దిమంది నేతలు కూడా అయోమయంలో ఉన్నారు. పార్టీ పునాదులు బలంగా లేకుండా 119 స్థానాల్లో తమ నేతలను బరిలోకి దింపాలని షర్మిల భావిస్తుండడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లీడర్లు లేకుండా పోటీ చేసి ఓటమిని మూట కట్టుకుంటారా అనే చర్చ జరుగుతోంది.