దయచేసి మా ఊరికి రావొద్దు.. బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న గ్రామస్తులు (వీడియో)
రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పరిధిలోని వట్టినాగులపల్లిలో బీఆర్ఎస్ ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.
దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పరిధిలోని వట్టినాగులపల్లిలో బీఆర్ఎస్ నేతల ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. మంగళవారం నార్సింగి మున్సిపల్ పరిధిలోని వట్టినాగులపల్లి గ్రామంలో ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు వెళ్లగా.. ప్రచారం చేయడానికి వీళ్లేదంటూ అడ్డు తగిలారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వట్టినాగులపల్లిలో విప్రోలో భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయలేదని.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ప్రచారానికి వస్తున్నారని బీఆర్ఎస్ నాయకులను స్థానిక ప్రజలు నిలదీశారు. డబుల్ బెడ్ రూమ్, దళితబంధు రాలేదని బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వర్గీయులకే కేటాయించారని బీఆర్ఎస్ నాయకులను విమర్శించారు. మా గ్రామంలో పనులు మేమే చేసుకుంటాం. ఇక్కడి నుండి వెళ్లిపోండి అంటూ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.