మేడిగడ్డ ఇన్సిడెంట్‌పై కేంద్రమంత్రి షెకావత్ రియాక్షన్ ఇదే!

మేడిగడ్డ బ్యారేజ్ ఘటనతో కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నిస్సహాయత బట్టబయలైందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విమర్శించారు.

Update: 2023-11-03 10:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజ్ ఘటనతో కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నిస్సహాయత బట్టబయలైందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై ఆయన శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ దురాశ, అవినీతి తెలంగాణలోని లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిందని, పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృథా చేసిందని దుయ్యబట్టారు.

కాగా, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై ఎన్డీఎస్ఏ కమిటీ ఇవాళ తన రిపోర్ట్‌ను విడుదల చేసింది. బ్యారేజ్ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లే పిల్లర్లు కుంగిపోయాయని నివేదికలో పేర్కొంది. బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని ఎన్డీఎస్ఏ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.


Tags:    

Similar News