తన్నుకున్న కాంగ్రెస్ నేతలు.. స్పృహ కోల్పోయిన కీలక నేత (వీడియో)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి అగ్రనేతలు వరుసగా ప్రచార పర్వంలో జోరు చూపిస్తున్నారు.

Update: 2023-11-24 08:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన జాతీయ స్థాయి అగ్రనేతలు వరుసగా ప్రచార పర్వంలో జోరు చూపిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం చేశారు. అధికార బీఆర్ఎస్‌కు ధీటుగా ప్రచారం నిర్వహించడంలో, జనాల్లోకి వెళ్లడంతో కాంగ్రెస్ అభ్యర్థులు సక్సెస్ అవుతున్నారు. అయితే, ఈ క్రమంలో ఓ నియోజకవర్గంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మందుల శామ్యూల్ శుక్రవారం చౌళ్ల రామారం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో యువజన నాయకుడు ఖమ్మంపాటి కుమార్ గౌడ్‌ను గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రచార రథం నుండి మెడలు పట్టి కిందకు నెట్టేశారు. కుమార్ గౌడ్ స్పృహ కోల్పోయాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Tags:    

Similar News