నిజామాబాద్‌లో బీఆర్ఎస్‌కు BIG షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి!
ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నిజామాబాద్ కీలక నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నిజామాబాద్ కీలక నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. నేడు బోధన్ పట్టణంలో కాంగ్రెస్ నిర్వహించబోయే బహిరంగ సభలో హస్తం గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది. మండవకు రాహుల్ గాంధీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కాగా, ఇప్పటికే మండవ తన అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కాగా, మండవ వెంకటేశ్వరరావు బీఆర్‌ఎస్‌లో నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించారు. అనూహ్యంగా ఆ స్థానాన్ని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి గులాబీ బాస్ ఖరారు చేశారు. దీంతో చేసేదేంలేక గత కొంత కాలంగా మౌనంగా ఉన్న మండవ.. ఇవాళ కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల వేళ పార్టీలో కీలక నేత చేరుతుండటంతో హస్తం శ్రేణుల్లో జోష్ నెలకొంది.