ఎన్నికల వేళ టీ.బీజేపీ వింత వైఖరి.. వరుసగా చేరికలకు బ్రేక్!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు చేరికలపై ఫోకస్ పెంచాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా చేరికలు జరుపుతున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు చేరికలపై ఫోకస్ పెంచాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా చేరికలు జరుపుతున్నారు. కాగా, బీజేపీ మాత్రం ఎన్నికల సమిపిస్తున్నా కొద్ది దూకుడుని దగ్గించుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే బీజేపీ స్టేట్ చీఫ్‌గా బండి సంజయ్‌ను తప్పించారో అప్పటి నుంచి పార్టీ దూకుడు తగ్గినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీలో చేర్చుకునేందుకు ఒకపైపు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నా.. మరోవైపు మొహం చాటేస్తుట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీకి చేరికలు ఎంతో అవసరం కానీ వచ్చిన ముఖ్య నేతలను పార్టీ దూరం చేసుకునే వింత పోకడలు పోతుంది. చేరండని హింట్ ఇచ్చినంక తీరా చూస్తే మొహం చాటేస్తున్నారు. దీంతో పార్టీ తీరుపై క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్ చేరికకు బ్రేక్ పడింది. బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరాల్సి ఉండగా, ఆ కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా మరో నేత బీజేపీలో చేరేందుకు ఇవాళ అన్ని సన్నాహాలు రెడీ చేసుకున్నారు. అనూహ్యంగా చీకోటి ప్రవీణ్ చేరికకు కూడా బ్రేక్ పడింది. కర్మన్‌ఘాట్ నుంచి నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు భారీ ర్యాలీగా వెళ్లిన చీకోటి ప్రవీణ్ వింత అనుభవం ఎదురైంది. ఇవాళ స్టేట్ ఆఫీస్‌లో లీడర్లు ఎవరు లేకపోవడంతో తన చేరికను అడ్డుకుంటున్నారని చికోటి ప్రవీణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చేరిక కోసం ముందే డెట్లు సీనియర్ నేతలు ఫిక్స్ చేసి తర్వాత ఎవరు అందుబాటులోకి రాకపోవడంతో నేతల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
చేరికపై కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇది జరిగిందని చీకోటి స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీ నేతలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చీకోటి తెలిపారు. బీజేపీపై అభిమానంతోనే వచ్చానని అన్నారు. సీనియర్ నేతలు అందుబాటులో లేకపోవడంతో చేరికకు బ్రేక్ పడిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.