ముగిసిన దశాబ్ది ఉత్సవాలు.. నెక్ట్స్ ఆ ప్రోగ్రామ్స్‌పై సీఎం కేసీఆర్ ఫోకస్!

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ 21 రోజుల పాటు బిజీగా గడిపారు. ఇప్పుడు నెక్ట్స్ ప్రోగ్రామ్స్ పై ఫోకస్ పెట్టారు. లీడర్లను ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Update: 2023-06-23 01:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ 21 రోజుల పాటు బిజీగా గడిపారు. ఇప్పుడు నెక్ట్స్ ప్రోగ్రామ్స్ పై ఫోకస్ పెట్టారు. లీడర్లను ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉంది. సోషల్ మీడియా వేదికగా నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తే ఎన్నికల్లో సహకరించేది లేదని లోకల్ లీడర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో అసమ్మతి లీడర్లను బుజ్జగించేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తున్నది. ఇరు వర్గాలను పిలిచి సమస్యను పరిష్కరించే యోచనలో ఉన్నారు. దీంతో అసమ్మతి తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ సర్దుకోకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని సంకేతాలు ఇవ్వనున్నట్టు సమాచారం.

25 చోట్ల కొత్త వారికి చాన్స్?

సుమారు 25 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని సర్వేల్లో వెల్లడైందని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ స్థానాల్లో కొత్త వారికి టికెట్ ఇవ్వాలనే నిర్ణయానికి సీఎం కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ విషయం గ్రహించిన కొందరు లీడర్లు టికెట్ కోసం పరోక్షంగా ఒత్తిళ్లకు దిగుతున్నారు. కొందరు పార్టీ మారుతామని సంకేతాలు ఇస్తుంటే, ఇంకొందరు లోకల్ గా అసమ్మతిని ఎంకరేజ్ చేస్తున్నారు. వీటన్నింటిని ఎప్పటికప్పుడు గమనిస్తున్న గులాబీ బాస్ డేంజర్ జోన్ లో ఉన్న సిట్టింగులను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

ఆగస్టు ఎండింగ్ డెడ్ లైన్..

ఆగస్టు తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూలు వచ్చే చాన్స్ ఉంది. ఈ లోపే అన్ని అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పార్టీకి మైలేజ్ వచ్చేతీరుగా కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు. ప్రతి పొగ్రామ్ లో స్థానిక ఎమ్మెల్యేల ప్రమేయం ఉండాలని, వారి చేతుల మీదుగానే జరగాలని ఆదేశించారు. ఈనెల 24 నుంచి 30 వరకు పోడు పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈనెల 26 నుంచి రైతుబంధు పైసలను అన్నదాతల అకౌంట్లలో వేసేందుకు రెడీ అవుతున్నారు. అలాగే బీసీ కుల వృత్తులకు లక్ష ఆర్థిక సాయం స్కీమ్ ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. డబులు బెడ్ రూమ్, గృహలక్ష్మి లబ్ధిదారులను ఒకేసారి ఎంపిక చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దళిత బంధు స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక, వారికి ఆర్థిక సాయం ఆగస్టులో పూర్తి చేసేందుకు డెడ్ లైన్ పెట్టుకున్నారు. మొత్తానికి ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపు అన్ని వెల్ఫెర్ స్కీమ్స్ ను ప్రారంభించేందుకు టార్గెట్ పెట్టుకున్నారు.

కాంగ్రెస్ దూకుడు, బీజేపీ మౌనంతో కంగారు

కాంగ్రెస్ దూకుడు, బీజేపీ మౌనం కేసీఆర్ లో కంగారు పుట్టిస్తున్నట్టు చర్చ ఉన్నది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ మెల్లగా బలం పుంజుకుంటున్నది. జులై2న ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించే సభ తర్వాత రాజకీయ పరిస్థితులు మరింతగా మారే అవకాశముంది. ఈ లోపే మరింత మంది గులాబీ లీడర్లు తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ లీడర్లు ధీమాతో ఉన్నారు. కొంత కాలంగా బీజేపీ ఎలాంటి హడావుడి చేయకుండా, మౌనంగా క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. అయితే రానున్న రోజుల్లో కేంద్ర బీజేపీ లీడర్లు రాష్ట్రంలో పట్టుకోసం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తారని ప్రచారం జరుగుతున్నది.

Also Read: 

మీ విధానాల్లో తప్పులు ఒప్పుకోరా!? 

Tags:    

Similar News