నల్లగొండలో బీఆర్ఎస్‌ భారీ షాక్.. ఫలించిన ఎంపీ కోమటిరెడ్డి రహస్య మంతనాలు?

రాష్ట్ర వ్యాప్తంగా కారు పార్టీకి బ్రేకులు పడుతున్నాయి. వరుసగా నేతలంతా పార్టీని వీడుతున్నారు. తాజాగా.. నల్లగొండ నియోజకవర్గంలో అత్యంత ప్రజాధారణ కలిగిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు.

Update: 2023-10-17 05:19 GMT

దిశ, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా కారు పార్టీకి బ్రేకులు పడుతున్నాయి. వరుసగా నేతలంతా పార్టీని వీడుతున్నారు. తాజాగా.. నల్లగొండ నియోజకవర్గంలో అత్యంత ప్రజాధారణ కలిగిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. వీరితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రహస్య జరిపిన మంతనాలు సఫలం అయినట్లు తెలుస్తోంది. నల్లగొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్ ఊహించని తీరులో కారు పార్టీకి రులుక్ ఇచ్చారు. ఎమ్మెల్యే బీసీ సామాజిక వర్గం నేతలను అలాగే మైనార్టీ నేతలకు బీఆర్ఎస్‌లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసహనంతో ఆయన అనుచర గణంతో పార్టీని వీడటానికి సిద్ధమయ్యారు. కౌన్సిలర్లు ఖయ్యుమ్ బేగ్, ప్రదీప్ నాయక్, జెర్రిపోతుల అశ్విని భాస్కర్ గౌడ్, పబ్బు సాయి శ్రీ సందీప్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు ఆజిజుద్దీన్ బషీర్ అలాగే ఇంకో ఎంపీటీసీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ‘దిశ’కు సమాచారం అందింది.

వరుసగా కీలక నేతలు పార్టీని వీడటంతో నల్లగొండలో గులాబీ పార్టీకి భారీ షాక్ తగిలేలా కనిపిస్తుంది. త్వరలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో భారీ చేరికలు ఉండనున్నట్లు విశ్వనీయ సమాచారం. గత రెండు రోజుల క్రితమే నల్లగొండ ఎంపీపీ, కాంగ్రెస్ నాయకుడు శ్రవణ్‌ను బీర్ఎస్‌లో చేర్చుకున్న రెండ్రోజుల్లోనే బీఆర్ఎస్‌కు కోమటిరెడ్డి షాకిచ్చారు. ఇంకా నల్లగొండ నియోజకవర్గంలో ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఎవరు ఏ క్షణంలో పార్టీలు మారుతారో తెలియక అయోమయ పరిస్థితి నెలకొంది. ఒకవైపు బీసీ సామాజిక వర్గాన్ని చైతన్యం చేస్తూ స్థానికతను ముందుకు వేస్తూ ముందుకు వస్తున్న నాయకుడు పిల్లి రామరాజు, మరోవైపు నల్లగొండలో ఎన్నడూ జరగని అభివృద్ధి తన హయంలో జరిగిందని ప్రజల్లోకి వెళ్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఇక నా అడ్డ నా గడ్డ అంటూ వారికి నేను నాకు వారు అంటూ ముందుకు వస్తున్న నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీంతో ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు.

గులాబీ నేతల్లో గుబులు:

ప్రతి రోజు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు ఒక్కసారిగా భూపాల్ రెడ్డికి ఝలక్ ఇస్తుండడంతో పార్టీ అధికార పార్టీ నాయకుల్లో గుబులు రేగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నాయకులు చాప కింద నీరులా ఒక్కొక్కరిగా అందరికీ వల వేసి పార్టీలోకి లాగుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News