ఎన్నికల వేళ తెలుగు భాషపై చిన్నచూపు.. ఈసీ తీరుపై నెటిజన్లు సీరియస్
ఎన్నికల్లో జరిగే అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలపై సామాన్య పౌరులు ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన సీ-విజిల్ యాప్‌పై తెలుగు రాష్ట్రాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ యాప్‌లో తెలుగు భాష లేకపోవడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల్లో జరిగే అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలపై సామాన్య పౌరులు ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన సీ-విజిల్ యాప్‌పై తెలుగు రాష్ట్రాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ యాప్‌లో తెలుగు భాష లేకపోవడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ యాప్‌లో ఇంగ్లీష్, హిందీ, కన్నడతో పాటు మరికొన్ని ప్రాంతీయ భాషలు అందుబాటులో ఉన్నప్పటికీ తెలుగు ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ యాప్‌లో తెలుగు భాషను అందుబాటులోకి తీసురాకపోవడం తెలుగు భాషపై చిన్నచూపు చూడటమే అని విమర్శిస్తున్నారు. ఈ మేరకు పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ఈసీని ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మరో వైపు సీ-విజిల్ యాప్ పౌరుల చేతిలో ఓ బ్రహ్మాస్త్రం వంటిదని ఈసీ చెబుతోంది. ఎన్నికల సందర్భంగా ఎవరైనా కోడ్ ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభపెట్టినా వాటికి సంబంధించిన ఫోటో, వీడియోలను తీసి ఈ యాప్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు.
ఇది C VIGIL అనే ఎలక్షన్ కమిషన్ యాప్. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జరిగే అక్రమాలను ఫోటో, వీడియో తీసీ ఎ.క. కు ఎగుమతి చేయడానికి ఉపయోగపడుతుంది.
— హిందీ భాష విధింపు ఆపండి - ఆంధ్ర & తెలంగాణ (@StopHindiinAPTS) October 21, 2023
దీంట్లో తెలుగు ఎందుకు లేదో? బహుశాః ఢిల్లీలో తెలుగు తెలిసిన వాళ్ళు లేరేమో!@ECISVEEP @YSRCParty @BRSparty pic.twitter.com/dZm6bzNaiq