బీఆర్ఎస్‌లో చేరిన పొంగులేటి అనుచరుడు తెల్లం వెంకట్రావు
కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అనుచరుణ తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్‌లో చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అనుచరుణ తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్‌లో చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మునిగిపోయే నావా అని తెల్లం వెంకట్రావు తొందరగా గ్రహించారని అన్నారు. వెంకట్రావు రాజకీయ భవిష్యత్‌కు తమది భరోసా అని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను నమ్మితే కుక్క తోక పట్టుకున్నట్లే అని విమర్శించారు. జల్-జంగల్-జమీన్ విషయంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి హితవు పలికారు. తెలంగాణలో కోటి ఎకరాల్లో సాగు జరుగుతోందని అన్నారు.