తెలంగాణ కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. రంగంలోకి సోనియా గాంధీ

ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల ప్రజా గర్జన సభ ఉంటుందని, ‘తిరగబడదాం.. తరిమికొడదాం’ నినాదంతో కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Update: 2023-08-19 12:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల ప్రజా గర్జన సభ ఉంటుందని, ‘తిరగబడదాం.. తరిమికొడదాం’ నినాదంతో కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల ప్రజా గర్జనకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని, ఈ బహిరంగ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఖర్గే విడుదల చేస్తారని చెప్పారు. ఈనెల 21 నుంచి 25 వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29న మైనార్టీ డిక్లరేషన్ వరంగల్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

సెప్టెంబర్ 6 లేదా 9 ఓబీసీ డిక్లరేషన్ ఉంటుందని, దీనికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హజరవుతారని అన్నారు. ఓబీసీ, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామని వెల్లడించారు. మహిళా డిక్లరేషన్ సభకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామన్నారు. రాహుల్ గాంధీని కూడా తీసుకువస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు అగ్రనేత సోనియాగాంధీని ఆహ్వానిస్తామని అన్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్స్, ఛార్జ్ షీట్స్, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కర్ణాటక తరహాలో కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ చేరేలా చూడాలన్నారు.

Tags:    

Similar News