తెలంగాణ డిసైడ్ అయింది.. కేసీఆర్ తెలుసుకోవడమే ఆలస్యం: రేవంత్
రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ గేమ్ రసవత్తరంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా డైలాగ్ పంచులు పేలుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్పై రెచ్చిపోయారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ గేమ్ రసవత్తరంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా డైలాగ్ పంచులు పేలుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్పై రెచ్చిపోయారు. 'తెలంగాణ డిసైడ్ అయ్యింది.. ఇక చాలు కేసీఆర్ దుర్మార్గాలు అని' అని వ్యాఖ్యానించారు. శనివారం ట్వీట్ చేసిన రేవంత్.. రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని తెలంగాణ డిసైడ్ అయిందని తమకు క్షేమం, తన సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యమని ప్రజలు నిర్ణయానికి వచ్చేశారని అన్నారు. కాగా, తెలంగాణ టూర్లో రాహుల్ గాంధీ సైతం తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుందని వ్యాఖ్యానించారు.