పోస్టల్ బ్యాలెట్ సమస్యపై స్పందించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్‌పై గందరగోళం నెలకొంది. ఎన్నికల విధుల్లో 3.03 లక్షల మంది ఉద్యోగులు ఉండగా కేవలం 1.68 మందికే బ్యాలెట్‌కు అనుమతి ఇచ్చినట్లు ఉద్యోగులు ప్రకటించారు.

Update: 2023-11-27 05:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్‌పై గందరగోళం నెలకొంది. ఎన్నికల విధుల్లో 3.03 లక్షల మంది ఉద్యోగులు ఉండగా కేవలం 1.68 మందికే బ్యాలెట్‌కు అనుమతి ఇచ్చినట్లు ఉద్యోగులు ప్రకటించారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో తలెత్తిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జోక్యం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్‌లో ఓటు వేసే అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News