కేసీఆర్కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా
దుబ్బాకను బంగారు తునక చేస్తామని కేసీఆర్, హరీష్ రావులు బొందల గడ్డ చేశారని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను బక్కొడినంటూ కేసీఆర్ ఓట్లకోసం వస్తున్నాడని.. కేసీఆర్ బక్కొడు కాదని బకాసురుడని, ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడని విరుచుకుపడ్డారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దుబ్బాకను బంగారు తునక చేస్తామని కేసీఆర్, హరీష్ రావులు బొందల గడ్డ చేశారని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను బక్కొడినంటూ కేసీఆర్ ఓట్లకోసం వస్తున్నాడని.. కేసీఆర్ బక్కొడు కాదని బకాసురుడని, ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కేసీఆర్కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానన్నారు. కేసీఆర్ తో పాటు ఆయన కొడుకు, బిడ్డ ఉండటానికి కచ్చితంగా ఇల్లు కట్టిస్తానని కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్లు కక్కిస్తామని హెచ్చరించారు.
గురువారం దుబ్బాకలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గత ఉప ఎన్నికల్లో వాళ్ల బంధువు గెలవాలని బీజేపీ అభ్యర్థిని బీఆర్ఎస్సే గెలిపించిందని ఆరోపించారు. కేంద్ర నిధులు రప్పించి దుబ్బాకను అభివృద్ధి చేస్తానని చెప్పి మూడేళ్లయినా ఇప్పప్పటి వరకు సమస్యలు తీర్చలేని రఘునందన్ రావుకు ఈసారి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.
More News : కేసీఆర్ కుటుంబంపై చాలా వ్యతిరేకత ఉంది: గోయల్