ఈసారి గతానికి మించిన నగదు, డబ్బు సీజ్ చేసిన పోలీసులు

ఈసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో క్రితంసారి కన్నా 454శాతం ఎక్కువగా నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్, కానుకలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ అంజనీకుమార్​తెలిపారు.

Update: 2023-12-02 16:06 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఈసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో క్రితంసారి కన్నా 454శాతం ఎక్కువగా నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్, కానుకలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ అంజనీకుమార్​తెలిపారు. ఈ క్రమంలో మొత్తం 11,859 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో సీజ్​చేసిన దానికన్నా ఈసారి 248 శాతం ఎక్కువగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇక, 559 శాతం అధికంగా మద్యం, 5,472 శాతం అధికంగా బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాలు, 5,252 శాతం అధికంగా డ్రగ్స్, 31,440 శాతం అధికంగా కానుకలను సీజ్​చేసినట్టు వివరించారు. స్వాధీనం చేసుకున్న వీటన్నిటి విలువ 469.63 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు.



 


Tags:    

Similar News