రేపటి నుంచి నా దృష్టి మొత్తం దానిపైనే.. మరోసారి మైనంపల్లి కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అసంతృప్తి నేత, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెదక్ ప్రజలే తనకు రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు.
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ అసంతృప్తి నేత, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెదక్ ప్రజలే తనకు రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలకు చెందిన ఓటర్లు కూడా తనకు రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేశారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో నాకు గెలిచానని, ఎవరో భిక్ష పెడితే గెలవలేదని అన్నారు. ఏ పదవి లేకపోయినా నా కంటే నా కొడుకు రోహిత్ ఎక్కువగా పనిచేస్తున్నాడని తెలిపారు. రేపటినుంచి మల్కాజ్గిరి నియోజవర్గంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తానని అన్నారు. వారం తర్వాత ప్రతీ ప్రశ్నకు సమాధానం చెబుతానని వెల్లడించారు. కాగా, తనకు కుమారుడికి టికెట్ రాకుండా మంత్రి హరీశ్ రావు అడ్డుకున్నారని ఇటీవల మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండిపెండెంట్గా అయినా సరే నేను నా కుమారుడు ఇద్దరం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అడ్డంగా హరీశ్ రావు లక్షల కోట్లు సంపాదించుకున్నాడని, అవన్నీ త్వరలోనే బయటకు తీస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు.