Mynampally Hanumanth Rao : కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నా

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఫిక్స్ అయినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలు ఫోన్ చేశారని చెప్పారు.

Update: 2023-09-25 06:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఫిక్స్ అయినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలు ఫోన్ చేశారని చెప్పారు. ఇంటికి వస్తున్నట్లు చెప్పగా.. ఆహ్వానించానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నానని.. తానేంటో బీఆర్ఎస్ నేతలకు చూపిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 27వ తేదీ వరకు ముహూర్తాలు బాగున్నాయని.. ఆలోపు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌లో చేరుతానని వెల్లడించారు. తనకు మద్దతు తెలిపిన నాయకులపై బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, అక్రమంగా కేసులు పెట్టి టార్చర్ చేస్తున్నదని మండిపడ్డారు. కాగా, తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌కు మెదక్ టికెట్ డిమాండ్ చేసిన మైనంపల్లికి గులాబీ బాస్ షాకివ్వడంతో గత శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు.



 


Tags:    

Similar News