TS: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష్యతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. 43 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్ష్యతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. 43 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టనున్నారు. అంతేగాక, ఎమ్మెల్సీ అభ్యర్థులనూ కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఇద్దరు పేర్లను ఖరారు చేసింది. ఇటీవల పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యానారయణ పేర్లను ఖరారు చేశారు. అంతేగాక, హైదరాబాద్ మెట్రో విస్తరణపైనా చర్చించారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు విస్తరించనున్నట్లు తెలిపారు. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. మియాపూర్ నుంచి లక్డీకపూల్ వరకు, ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట్ వరకు, ఉప్పల్ నుంచి బీబీ నగర్ వరకు మెట్రో విస్తరింపజేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.