తెలంగాణ ఎన్నికలపై మిషన్ చాణక్య స్టడీ రిపోర్ట్.. ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం

తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా..? నేనా..? అనే తరహాలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ సమయంలో డజన్ల కొద్దీ సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్ పేరుతో రిపోర్టులను గుప్పిస్తున్నాయి.

Update: 2023-10-22 06:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా..? నేనా..? అనే తరహాలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ సమయంలో డజన్ల కొద్దీ సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్ పేరుతో రిపోర్టులను గుప్పిస్తున్నాయి. ఒక్కో సంస్థ అంచనాలు ఒక్కో తీరులో ఉంటున్నాయి. ఇప్పటివరకు సుమారు పది సంస్థలు సర్వే చేయగా అందులో మెజారిటీ కాంగ్రెస్‌కే అనుకూల పవనాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. మరికొన్ని బీఆర్ఎస్‌కు జై కొట్టాయి. ఇదిలా ఉండగా.. తాజాగా.. తెలంగాణ ఎన్నికలపై మిషన్ చాణక్య సర్వే ఫలితాలను వెల్లడించింది. ఇందులో బీఆర్ఎస్‌కు 44.62%, కాంగ్రెస్‌కు 32.71%, బీజేపీకి 17.6% ఓటింగ్ వస్తుందని వెల్లడించింది.

Tags:    

Similar News