అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈనెల 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

Update: 2023-09-15 07:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈనెల 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతున్నారు. కాగా, ఈనెల 16వ తేదీన రాత్రి 7:20 గంటలకు ఆయన హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. రాత్రి 8 గంటలకు సీఆర్పీఎఫ్ సెక్టార్ మెస్‌కు చేరుకుంటారు. ఆరోజు రాత్రి అక్కడే కేంద్ర మంత్రి షా బస చేయనున్నారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆపై పలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. 11:10 నిమిషాల వరకు పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవాలు జరగనున్నాయి.

ఈ వేడుకల అనంతరం 11:15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సీఆర్ పీఎఫ్ సెక్టార్ మెస్‌కు చేరుకుంటారు. 11:50 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు అక్కడే ఉండనున్నారు. ఈ రెండు గంటల్లో ఆయన ఎవరితో భేటీ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఆర్ పీఎఫ్ మెస్ నుంచి 1:45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరుతారు. 2:25 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

Tags:    

Similar News