రూ.50 కోట్లకు పీసీసీ పదవి కొన్నాడని కోమటిరెడ్డి చెప్పారు: KTR
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నాడని సొంత నేతలే రేవంత్‌పై ఈడీకి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నాడని సొంత నేతలే రేవంత్‌పై ఈడీకి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ఇప్పటికే పట్టుబడ్డాడని అన్నారు. అవినీతి గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని గాంధీ అన్నారు.. ఇలాంటి వారు కాంగ్రెస్‌లోకి వస్తారని గాంధీ ఆనాడే ఊహించినట్లున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు కొనుగోలు చేశాడని స్వయంగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే ఆరోపించారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
Read More..
రాహుల్ గాంధీతో కోదండరాం భేటీ.. చర్చించిన అంశాలివే..!
BRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు