‘దావూద్ ఇబ్రహీం కంటే రేవంత్ రెడ్డే ఎక్కువ డేంజర్’
తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి.. ఇండియా పప్పు రాహుల్ గాంధీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... ఇప్పుడు అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు 11 సార్లు అధికారమిస్తే ఏం చేశారని ప్రశ్నించారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి.. ఇండియా పప్పు రాహుల్ గాంధీ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... ఇప్పుడు అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు 11 సార్లు అధికారమిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. పార్టీల చరిత్ర తెలుసుకొని ఓట్లే వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీకి చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు వరం అయితే.. కాంగ్రెస్ పార్టీ శనీశ్వరం అని తీవ్ర విమర్శలు చేశారు. వెంటనే రాహుల్ గాంధీ స్ర్కిప్ట్ రైటర్‌ను మార్చుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి దావూద్ ఇబ్రహీం కంటే డేంజర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు, చవాకులు పేలితే ఊరుకోం అని హెచ్చరించారు. హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ అవినీతికి పాల్పడ్డారు అని కేటీఆర్ గుర్తుచేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ చేయని స్కామ్ లేదని ఎద్దేవా చేశారు.