పులి బయటకొచ్చే సమయం ఆసన్నమైంది.. కేసీఆర్‌పై కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్, బీజేపీ పార్టీపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వదిలేసిన ఇద్దరు, ముగ్గురు నాయకులను వాళ్లు చేర్చుకొని ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. అమలుకు సాధ్యం కానీ, హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీ పార్టీపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వదిలేసిన ఇద్దరు, ముగ్గురు నాయకులను వాళ్లు చేర్చుకొని ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. అమలుకు సాధ్యం కానీ, హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవాళ ఎన్నికల షెడ్యూల్ కూడా విడులైందని ఇక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి అనే గుంట నక్కలు బయటకు వస్తాయని అన్నారు. ‘కాంగ్రెస్, బీజేపీ హామీలు పక్కనబెట్టండి.. రేపో మాపో పులి(కేసీఆర్) బయటకు వస్తుంది. వచ్చాక ఇప్పుడు ఎగిరి పడుతున్న గుంటనక్కలన్నీ మళ్లీ మాయం కావడం ఖాయం’ అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బయటకు రాగానే బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేస్తామని.. కాంగ్రెస్, బీజేపీ మాదిరి పిచ్చి పిచ్చి హామీలు తాము ఇవ్వబోమని, అమలుకు సాధ్యమయ్యే హామీలనే ఇస్తామని, దానిపైనే కేసీఆర్ కసరత్తు చేస్తున్నాడని అన్నారు.