కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు: హరీశ్ రావు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు పర్యాయాలు తమకు అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. సంపూర్ణ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు చెప్పారు. ప్రజల నమ్మకాలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన కొనసాగాలని ఆశిస్తున్నానని భావించారు. ఎన్నికల సమరంలో తమకు అండగా నిలిచిన పార్టీ శ్రేణులు, నాయకులకు ధన్యవాదాలు చెప్పారు.