కవితను ఇబ్బంది పెట్టే ప్రయత్నం: మంత్రి హరీష్ రావు
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉన్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతోనే జమిలికి బీజేపీ ప్లాన్ చేసిందని, జనాన్ని నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీకి జమిలి ఎన్నికలతో నష్టం లేదని చెప్పారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉన్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతోనే జమిలికి బీజేపీ ప్లాన్ చేసిందని, జనాన్ని నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీకి జమిలి ఎన్నికలతో నష్టం లేదని చెప్పారు. కుట్రతోనే ఎమ్మెల్సీ కవితను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ప్రయత్నచేసిందని, కానీ తమకు కోర్టులపై న్యాయం, ధర్మం మీద నమ్మకముందన్నారు. ధర్మం.. న్యాయం గెలుస్తదన్నారు.
ప్రతిపక్షాలపై దాడి చేయడమే లక్ష్యంగా బీజేపీ టార్గెట్ పెట్టుకుందని, ఒక్క బీజేపీ నాయకుడిపై ఎందుకు కేసు అవ్వదని ప్రశ్నించారు. ప్రజలకు పనిచేసి ప్రజల హృదయాలు గెలువాలి కానీ.. ప్రతిపక్షాలను బలహీన చేస్తాం.. ప్రతి పక్ష నాయకులను టార్గెట్ చేస్తాం.. అక్రమ కేసులు పెడతాం అనుకుంటే అది ప్రజాస్వామ్యంలో ప్రజలు హర్షించరన్నారు. తమిళనాడు స్టాలిన్ పార్టీపై దాడి చేస్తున్నారని, కర్ణాటకలో ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నారని దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఒక కుట్రతోని దాడి చేస్తున్నారని విమర్శించారు.
ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. 2009లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదన్నారు. మేనిఫెస్టో, డిక్లరేషన్లు ముందు కర్ణాటకలో చేసి చూపించాలని సవాల్ చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదని, తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మంత్రి విమర్శించారు.