ఎన్నికల వేళ కేటీఆర్‌కు BIG షాక్.. అనుచిత వ్యాఖ్యలను బయటపెట్టిన వీడియో
ఎన్నికల ప్రచారానికి మరో రెండ్రోజులే ఉండటంతో మంత్రి కేటీఆర్ స్పీడు పెంచారు. సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో తీవ్ర పోటీ ఉండటంతో ప్రత్యేకంగా దృష్టా సారించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారానికి మరో రెండ్రోజులే ఉండటంతో మంత్రి కేటీఆర్ స్పీడు పెంచారు. సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో తీవ్ర పోటీ ఉండటంతో ప్రత్యేకంగా దృష్టి సారించారు. విస్తృతంగా క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ కేటీఆర్‌కు సంబంధించిన ఓ పాత వీడియోను సోషల్ మీడియా వేదికగా పద్మశాలీలు ట్రోల్ చేస్తున్నారు. 2018 లో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పద్మశాలీలను కించపరిచేలా చేసిన కామెంట్స్‌ను వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో షేర్ చేస్తున్నారు.
‘సాయంత్రం నాలుగైతే.. వాళ్లంతా పెద్దూరు కానీ, సారంపల్లి తాళ్లల్లనే దొరుకుతారు. అక్కడే కల్లు, గుడాలు, చికెన్ తినుకుంటూ దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు’ అని పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులను కించపరిచేలా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో కేటీఆర్ అసలు నిజ స్వరూపం ఇది అంటూ పద్మశాలీ వాట్సాప్ గ్రూపుల్లో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ వైరల్ వీడియో కలకలం రేపుతోంది. పద్మశాలీలు అంటే తాగుబోతులు కాదని.. ఇంత చులకన చేసి మాట్లాడిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని.. చీము, నెత్తురు ఉన్న పద్మశాలీలంతా ఏకం కావాలని ఆ సామాజికవర్గ నేతలు ఐఖ్యమవుతున్నారు. మన ఓటు మనకే వేసుకుందాం.. మనల్ని మనమే గెలిపించుకుందామని పిలుపునిస్తున్నారు.