'మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం జరగడానికి అసలు కారణం ఇదే' (వీడియో)
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌కు పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ప్రచార రథం గ్రిల్ ఊడిపోయి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కిందపడిపోగా భద్రత సిబ్బంది పట్టుకోవడంతో తృష్టిలో తప్పించుకున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌కు పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ప్రచార రథం గ్రిల్ ఊడిపోయి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కిందపడిపోగా భద్రత సిబ్బంది పట్టుకోవడంతో తృష్టిలో తప్పించుకున్నారు. ఈ ఘటనలో రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి వాహనం పైనుండి కిందపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై రకరకాల వాదనలు వినిపిస్తుండగా నెటిజన్లు ఓ సరికొత్త వాదనను తెరమీదకు తీసుకువస్తున్నారు.
మంత్రి కేటీఆర్ దేవుడిని అవమానించాడని అందువల్లే ఇలా జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇవాళ నామినేషన్ వేసేందుకు బయలుదేరిన కేటీఆర్ తన ఇంట్లో వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా దేవుడి విగ్రహం ఉన్న టేబుల్ కిందే కేటీఆర్ చెప్పులు విప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. భయంకర హిందూ కుటుంబం తామే అని చెప్పుకునే కేటీఆర్ వినాయకుడి కింద చెప్పులు విడిచి మన ధర్మాన్ని అవమానించడంతో వెంటనే కర్మ ఫలాన్ని అనుభవించాడని కామెంట్స్ చేస్తున్నారు.
"భయంకర హిందూ" కల్వకుంట్ల డ్రామారావు
— Amarnath Sarangula (@amarhindu) November 9, 2023
వినాయకుని కింద చెప్పులు విడిచి మనధర్మాన్ని అవమానిస్తే, వెంటనే కర్మ అనుభవించాడు.#ThatIsKarma #TelanganaElections2023 pic.twitter.com/H7fth81KzQ