కాంగ్రెస్ మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారు: ఎంపీ కోమటిరెడ్డి
బీఆర్ఎస్ మేనిఫెస్టోపై తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్‌లు కోమటిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మేనిఫెస్టోపై తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్‌లు కోమటిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి.. బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. తమ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయిందని ఎద్దేవా చేశారు. అంతేగాక, చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో నిరసన తెలుపుతున్న ఐటీ ఉద్యోగులపై కేసులు పెట్టడం సరైంది కాదని అన్నారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఐటీ ఉద్యోగులపై కేసులు పెట్టడం ఏంటని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఏమైనా పాకిస్థానా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుందని అన్నారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని ఆయన వ్యాఖ్యనించారు. అక్రమ కేసుల విషయమై మాట్లాడదామంటే సైబరాబాద్ సీపీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. ఈ తరహా ఇబ్బందులకు గురి చేయటం సమంజసం కాదని కోమటిరెడ్డి అన్నారు.