రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ఢిల్లీలో కలిశారు.

Update: 2023-06-23 07:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కంటోన్మెంట్‌లో స్కైవేల నిర్మాణంపై చర్చించామన్నారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, మౌళిక వసతుల కల్పనలో కేంద్రం చేయూత నివ్వాలన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని కోరామని అన్నారు. రాజీవ్ రహదారిలో స్కైవే నిర్మాణానికి 96 ఎకరాల కంటోన్మెంట్ ల్యాండ్ అడిగామన్నారు. ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇస్తామన్నారు. 9 ఏళ్ల నుంచి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు అందిన సాయం సున్నా అన్నారు. హైదరాబాద్‌లో స్కై వాక్స్ నిర్మిస్తున్నామన్నారు. ఉప్పల్‌లో స్కై వాక్‌ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. లీజ్ ల్యాండ్స్‌ని జీహెచ్‌ఎంసీకి బదలాయించాలని కోరామన్నారు. తెలంగాణకు చేయూత ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. 

Also Read..

విపక్షాల భేటీకి మాయావతి దూరం.. టీ-కాంగ్రెస్‌తో పొత్తుకు ఆర్‌ఎస్పీ ఆసక్తి! 

Tags:    

Similar News