స్టార్ హీరో Allu Arjun మామకు CM KCR బిగ్ షాక్..!

స్టార్ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి్కి సీఎం కేసీఆర్ బిగ్ షాకిచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్‌ను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రకటించారు.

Update: 2023-08-21 10:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో అల్లు అర్జున్ మామ, బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బిగ్ షాకిచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్‌ను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రకటించారు. 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో రిలీజ్ చేశారు. ఈ లిస్ట్‌లో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి నోముల భగత్‌ పేరును కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సాగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు నోముల భగత్‌కు మరోసారి లైన్ క్లియర్ అయ్యింది.

కేసీఆర్ నిర్ణయంతో నాగార్జున సాగర్ టికెట్ ఆశించిన అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర నిరాశే ఎదురయ్యింది. గతంలో బీఆర్ఎస్ తరుఫున ఇబ్రహీంపట్నం నుండి బరిలోకి దిగిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఈ సారి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకున్నారు. అధిష్టానం ఆదేశిస్తే తన సొంత నియోజకవర్గమైన సాగర్ నుండి బరిలోకి దిగుతానని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గతంలో బహిరంగంగానే ప్రకటించారు.

నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లారు. సాగర్ బీఆర్ఎస్ టికెట్ వస్తుందని ఆయన నమ్మకం పెట్టుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రటించిన లిస్ట్‌లో సాగర్ అభ్యర్థిగా మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ వైపే కేసీఆర్ మొగ్గు చూపడంతో చంద్రశేఖర్ రెడ్డికి భంగపాటు ఎదురయ్యింది. ఇటీవల అల్లుడు అల్లు అర్జున్‌ కూడా మామ చంద్రశేఖర్ రెడ్డి కోసం సాగర్ నియోజకవర్గంలో పర్యటించారు.

తనకు బీఆర్ఎస్ సాగర్ టికెట్ కేటాయిస్తే అల్లు అర్జున్ తన తరుఫున ప్రచారం చేస్తారని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రశేఖర్ రెడ్డి నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను కూడా అల్లుడు అల్లు అర్జున్ చేత ఒపెనింగ్ చేయించాడు. పలు సేవా కార్యక్రమాలతో పాటు అల్లుడు అల్లు అర్జున్ ఇమేజ్‌ను వాడుకుని సాగర్‌లో పోటీ చేయాలనుకున్న చంద్రశేఖర్ రెడ్డికి కేసీఆర్ ఇవాళ విడుదల చేసిన అభ్యర్థుల లిస్ట్ తీవ్ర నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు.

ఇక, తెలంగాణలో ఎన్నికల హాడావుడి మొదలైంది. అన్ని పార్టీలకంటే ముందుగానే అధికార బీఆర్ఎస్ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉండగానే.. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో 115 మంది అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఈ సారి రెండు నియోజకవర్గాల నుండి పోటీకి దిగుతున్నారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ సెగ్మెంట్‌తో పాటు కామారెడ్డి నుండి కూడా బరిలోకి దిగుతున్నానని తెలిపారు.

ఇవి కూడా చదవండి : అక్షయ్ కుమార్ వల్ల డిప్రెషన్‌కు గురయ్యా.. స్టార్ నటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్

Tags:    

Similar News