BJP MP Arvind Dharmapuri : అర్వింద్‌కు కీలక బాధ్యతలు!

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ బీజేపీ స్పీడు పెంచింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడంతో పాటు చేరికలపై దృష్టి పెట్టారు.

Update: 2023-07-24 06:19 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీతో తాడోపేడో తేల్చుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి తొలిసారి హైదరాబాదులో బీజేపీ అన్ని విభాగాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆదివారం జరిగిన సమావేశంలో బీజేపీ సోషల్ మీడియా బాధ్యతలను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మీడియాను ప్రధానంగా వాడుకోవాలని నిర్ణయించింది.

నిజామాబాద్ డైనమిక్ ఎంపీగా పేరు గడించిన అర్వింద్‌కు సోషల్ మీడియా బాధ్యతలను అప్పజెప్పి సమన్వయం చేయాలని సూచించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధానంగా సీఎం కేసీఆర్ అతని కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో, జాతీయస్థాయిలో మాట్లాడే సత్తా కలిగిన ఎంపీ అర్వింద్‌కు ఈ బాధ్యతలను అప్పజెప్పినట్టు తెలిసింది. జాతీయ నాయకులు ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ భన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సోషల్ మీడియా రన్ చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా సోషల్ మీడియా తీర్చిదిద్దాలని సూచించినట్టు తెలిసింది.

Read More: Smita Sabharwal : స్మితా సబర్వాల్‌కు MLA రఘునందన్ రావు కౌంటర్

Tags:    

Similar News