TS: రాష్ట్రంలో కాంగ్రెస్‌ గ్రాఫ్ పెరడగానికి అసలు కారణం ఇవే!

కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన సిక్స్ గ్యారెంటీస్‌తో రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజాదరణ పెరిగినట్లు తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలలుగా సర్వే చేస్తున్న ఆ సంస్థ ప్రతీ ఆదివారం నివేదికను వీక్లీ ట్రాకర్ పేరుతో వెల్లడిస్తూ వస్తున్నది.

Update: 2023-09-25 03:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన సిక్స్ గ్యారెంటీస్‌తో రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజాదరణ పెరిగినట్లు తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలలుగా సర్వే చేస్తున్న ఆ సంస్థ ప్రతీ ఆదివారం నివేదికను వీక్లీ ట్రాకర్ పేరుతో వెల్లడిస్తూ వస్తున్నది. దాదాపు 45 రోజులుగా కాంగ్రెస్ క్రమంగా తన గ్రాఫ్‌ను పెంచుకున్నట్లు తేలింది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కే ఇప్పటికీ ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్లు పేర్కొంటున్న ఆ సంస్థ.. సోనియాగాంధీ ప్రకటన తర్వాత వారం రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకి 2.8% ఆదరణ పెరిగినట్లు తెలిపింది.

గత వారం కాంగ్రెస్‌కు 30.3% ఆదరణ ఉండగా సిక్స్ గ్యారంటీస్ తర్వాత అది 33.1%కు చేరుకున్నదని, బీఆర్ఎస్ ఆదరణ గత వారం 39% ఉంటే ఇప్పుడు అది 39.7%కి పెరిగినట్లు తెలిపింది. ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ క్రమంగా తగ్గుతూ ఉన్నట్లు తెలిపింది. ఈ నెల 17న తుక్కుగూడలో జరిగిన బహిరంగసభలో సోనియాగాంధీ ప్రకటించిన సిక్స్ గ్యారంటీస్ మంచివేనని 58% మంది అభిప్రాయపడ్డారు. ఈ గ్యారంటీస్ ప్రభావం ఓటింగ్‌పై ఉంటుందని 46% మంది నుంచి సానుకూలంగా స్పందించగా ఆ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని 37% మంది అభిప్రాయపడ్డారు. కానీ ఈ హామీలు బయటకు బాగానే కనిపిస్తున్నా అమలు చేయడానికి సాధ్యం కాదని 38% మంది వ్యాఖ్యానించారు. పాలసీలు మంచివే అయినా పార్టీ గెలుపొందడానికి పెద్దగా దోహదపడవని 24% మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు.

తెలంగాణ ఇంటెన్షన్స్..

ఈ నెల 17-23 మధ్యలో 3వేల మంది నుంచి సేకరించిన అభిప్రాయాల్లో పై అంశాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీకి 39.7% మంది, కాంగ్రెస్ పార్టీకి 33.1% మంది, బీజేపీకి 9% మంది మొగ్గుచూపారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేమని 7.57% మంది అభిప్రాయపడగా.. ఇప్పుడే చెప్పలేమని మరో 10.5% మంది వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య క్రమంగా గ్యాప్ తగ్గుతూ ఉన్నట్లు పేర్కొన్న ఆ సంస్థ.. ఇదంతా ‘హంగ్’, ‘చెప్పలేం’ అనే సెక్షన్ల నుంచే ఈ రెండు పార్టీలవైపు మొగ్గు చూపుతున్నట్లు వివరించింది.

More News : కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో కనిపించని కీలక నేతల పేర్లు.. రియాక్షన్ ఇదే!

టికెట్ల కేటాయింపు వేళ భట్టి విక్రమార్కతో కీలక నేతల భేటీ

Tags:    

Similar News