BRS MLA గాదరి కిషోర్‌కు హైకోర్టు షాక్

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఎన్నికపై హైకోర్టులో విచారణ జరిగింది. గాదరి కిషోర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2023-08-28 12:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఎన్నికపై హైకోర్టులో విచారణ జరిగింది. గాదరి కిషోర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అద్దంకి దయాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని గాదరి కిషోర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అనూహ్యంగా హైకోర్టు గాదరి కిషోర్ పిటిషన్‌నే డిస్మిస్ చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాదు సాక్ష్యుల లిస్ట్ ఫైనల్ చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News