టీ.కాంగ్రెస్‌కు సెన్సేషనల్ షాక్.. పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా

ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. పార్టీకి మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు పార్టీ అన్యాయం చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2023-10-13 08:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనగామ టికెట్ తనకు ఇవ్వట్లేదని తెలుసుకున్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన తాను.. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ కోసం నిర్విరామంగా పనిచేశానని లేఖలో పేర్కొన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, 12 ఏళ్లు మంత్రిగా పనిచేసిన తనకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతకొన్ని రోజుల నుంచి జనాభా ప్రకారం బీసీలకు టికెట్లు ఇవ్వాలని హైకమాండ్‌ను పలుమార్లు రిక్వెస్ట్ చేశానని కానీ, తన మాటను పార్టీ పరిశీలనలో కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.

పది రోజుల క్రితం ఢిల్లీకి వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ ఓ వేణుగోపాల్‌ను కలుద్దామని ప్రయత్నించినా.. కనీసం ఒక్క ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వకపోవడం దారుణమని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఓ సీనియర్ నాయకుడికే పార్టీలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. కొత్త కేడర్, లీడర్ల పరిస్థితి ఏమిటో ఊహించుకోవాలని ఆయన ఖర్గేకు వివరించారు. జనగామ నియోజకవర్గంపై తనకు పూర్తిస్థాయిలో పట్టున్నప్పటికీ... కొంతమంది వ్యక్తులు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని స్పష్టం చేశారు. సర్వేల పేరిట టికెట్లలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆయన నొక్కి చెప్పారు..





 


 



Tags:    

Similar News