సచివాలయంలో పక్కపక్కనే అత్తా, అల్లుడి చాంబర్లు.. ఫస్ట్ టైమ్ ఒకే పార్టీలో ఇద్దరూ మంత్రులు!

వారిద్దరూ బంధువులు. వరుసకు అత్తా అల్లుడు. కానీ.. రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం అంతా ఇంతా కాదు. ఆ జిల్లా పాలిటిక్స్‌లో వీరి రూటే సెపరేట్. ఒకే జిల్లా అయినప్పటికీ ఏనాడూ ఒకే కేబినెట్లో మంత్రులుగా లేరు.

Update: 2023-08-30 10:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వారిద్దరూ బంధువులు. వరుసకు అత్తా అల్లుడు. కానీ.. రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం అంతా ఇంతా కాదు. ఆ జిల్లా పాలిటిక్స్‌లో వీరి రూటే సెపరేట్. ఒకే జిల్లా అయినప్పటికీ ఏనాడూ ఒకే కేబినెట్లో మంత్రులుగా లేరు. ఫస్ట్ టైమ్ ఇద్దరూ మంత్రులయ్యారు. సచివాలయంలోనూ వారి చాంబర్లూ పక్కపక్కనే. ఆ ఇద్దరు ఎవరో కాదు.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి.. పట్నం మహేందర్ రెడ్డి, రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఈ రెండు కుటుంబాలు తెలుగుదేశంలో ఉన్నా ఆ పార్టీలో తలెత్తిన సంక్షోభం తర్వాత పట్నం తెలుగుదేశంలో కొనసాగారు. సబిత భర్త ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచీ ఈ రెండు ఫ్యామిలీల మధ్య రాజకీయ వైరం కొనసాగుతూనే ఉన్నది.

తూర్పు పడమర కాస్త పక్కపక్కన

జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం కోసం రెండు కుటుంబాల మధ్య పోరు కొనసాగుతూనే ఉన్నది. కేసీఆర్ రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత సబిత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరడంతో అత్తా అలుళ్లిద్దరూ ఒకే పార్టీవారయ్యారు. తొలి టర్మ్ పట్నం మంత్రిగా ఉంటే సెకండ్ టర్మ్ సబిత మంత్రి అయ్యారు. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా పట్నం మహేందర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించింది. ఈ రెండు ఫ్యామిలీలు ఒకేసారి మంత్రివర్గంలో ఉండడం ఇదే ఫస్ట్ టైమ్. జిల్లాలో వీరిద్దరూ తూర్పు-పడమరగా ఉన్నా ఒకే పార్టీలో, ఒకే కేబినెట్‌లో కొనసాగు తుండడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు జిల్లా పాలిటిక్స్‌లో ఇదే హాట్ టాపిక్ అయింది.

అంతేకాదు.. ఇద్దరి మధ్య రాజకీయ వైరం ఉన్నా కొత్త సచివాలయంలో వీరి చాంబర్లు మాత్రం పక్కపక్కనే. ఫస్ట్ ఫ్లోర్‌లో (బీ బ్లాక్) సబితా ఇంద్రారెడ్డి చాంబర్ పక్కనే ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి చాంబర్ (నెం 21. 21) రెడీ అయింది. మధ్యలో ఒకటి రెండు డిపార్టుమెంటు సెక్షన్ ఆఫీసులుంటాయి. గత వారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం.. సమాచార పౌర సంబంధాలు, మైనింగ్, భూగర్భ వనరుల శాఖ బాధ్యతలను మధ్యాహ్నం తర్వాత చేపట్టనున్నారు. కొత్తగా ముస్తాబైన చాంబర్లోకి అడుగు పెట్టబోతున్నారు.


Tags:    

Similar News