మీ ఓటు వేరేవాళ్లు వేస్తే.. ఏం చేయాలో తెలుసా?
పోలింగ్ కేంద్రానికి వెళ్లాక మీ పేరు వద్ద మీరు ఓటు వేయాల్సిన స్థలంలో బై మిస్టేక్‌లో వేరే వాళ్లు వేస్తే కంగారు పడకూడదు.
దిశ, వెబ్‌డెస్క్: పోలింగ్ కేంద్రానికి వెళ్లాక మీ పేరు వద్ద మీరు ఓటు వేయాల్సిన స్థలంలో బై మిస్టేక్‌లో వేరే వాళ్లు వేస్తే కంగారు పడకూడదు. ముందుగా అధికారులకు సమాచారం అందించాలి. 1961లో తీసుకొచ్చిన సెక్షన్ 49 (పి) ప్రకారం దీన్ని టెండర్డ్ ఓటు అని పిలుస్తారట. అలా మీకు జరిగితే.. ఓటు వేస్తే దాన్ని రద్దు చేసి తిరిగి మీరు ఓటు వేయవచ్చు కానీ ఈవీఎంలో వేయలేం. కాబట్టి దానిని భద్రపరిచి అధికారులు కౌంటింగ్ కేంద్రానికి పంపుతారు. దీంతో మీ ఓటును మీరు వినియోగించుకున్నట్లు అవుతుంది. అంతే కానీ ఓటు వేరే వాళ్లు వేసారని బయటకు వచ్చేయకూడదు. అధికారులకు సమాచారం అందిస్తే మీరు ఓటు వేసే అవకాశం కచ్చితంగా లభిస్తుంది.