బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఎం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. పొత్తుల వ్యవహారంలో వామపక్షాలను దూరం పెట్టిన బీఆర్ఎస్ పార్టీ తాజాగా ఓ నియోజకవర్గంలో గెలుపు కోసం సీపీఎం పార్టీ మద్దతు కోరింది.

Update: 2023-11-16 12:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. పొత్తుల వ్యవహారంలో వామపక్షాలను దూరం పెట్టిన బీఆర్ఎస్ పార్టీ తాజాగా ఓ నియోజకవర్గంలో గెలుపు కోసం సీపీఎం పార్టీ మద్దతు కోరింది. కాగా, బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా మంత్రి హరీశ్‌ రావు ప్రచారంలో దూసుళ్తున్నారు. పార్టీ విజయం కోసం ఏ అవకాశం వచ్చినా వదిలి పెట్టకుండా అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంగారెడ్డి లోని సీపీఎం కార్యాలయంలో పార్టీ నేతలను తాజాగా మంత్రి కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సిందిగా సీపీఎం నేతలు చుక్క రాములు, బి.మల్లేశంను కోరారు. మంత్రి హరీశ్‌ రావు వినతి మేరకు ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో మద్దతు ఇస్తామని సీపీఎం నాయకులు హామీ ఇచ్చినట్లు సమాచారం.



 


Tags:    

Similar News