వచ్చే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ.. కూనంనేని ప్రకటన

బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై వామపక్షాలు సీరియస్‌గా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లు ఇస్తామని హామీ ఇచ్చిన సడన్‌గా అభ్యర్థులను ప్రకటించారని మండిపడుతున్నాయి.

Update: 2023-08-22 09:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై వామపక్షాలు సీరియస్‌గా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లు ఇస్తామని హామీ ఇచ్చి సడన్‌గా అభ్యర్థులను ప్రకటించారని మండిపడుతున్నాయి. తాజాగా.. ఈ వ్యవహారంపై సీపీఐ, సీపీఎం పార్టీలు వేర్వేరుగా మంగళవారం హైదరాబాద్‌లో సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. పొత్తుల కోసం తామెప్పుడు వెంపర్లాడలేదని అన్నారు. తన అవసరం కోసం కేసీఆరే తమ వద్దకు వచ్చారని తెలిపారు. ప్రజాతంత్ర పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. తాము కేసీఆర్ అపాయింట్మెంట్ కోరిన మాట వాస్తవమే.. కానీ కేసీఆర్ స్వార్థంగా వ్యవహరించారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేయాలో త్వరలోనే ప్రకటన చేస్తామని తేల్చి చెప్పారు.

Tags:    

Similar News