‘మెడలో BRS కండువా ఉంటే చాలు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు’

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడింది కాంగ్రెస్ నేత అయితే తమ పార్టీకి చెందిన నేతలపై ఎందుకు దాడులకు పాల్పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.

Update: 2023-10-31 15:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడింది కాంగ్రెస్ నేత అయితే తమ పార్టీకి చెందిన నేతలపై ఎందుకు దాడులకు పాల్పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలవుతోందా? అని ప్రశ్నించారు. సిద్దిపేట సీపీపై మంగళవారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్‌కు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాకు పలు అంశాలు వెల్లడించారు. అక్టోబర్ 13వ తేదీన ఒకసారి సిద్దిపేట పోలీసుల తీరుపై సీఈసీకి ఫిర్యాదు చేశామని ఆయన గుర్తుచేశారు.

కాగా, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి అంశంలోనూ సిద్దిపేట సీపీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు. సీపీ స్టేట్ మెంట్ వల్ల తమ పార్టీ కార్యకర్తలపై బీఆర్ఎస్ నేతలు దాడులకు దిగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయో నేరుగా తానే సీపీకి చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఫటనలో రాజు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందినవాడని సీఎం కేసీఆర్ కు చెందిన పత్రికలో ప్రచురించారని, అయినా తమ నేతలపై దాడులు ఎందుకు చేస్తున్నట్లని ఆయన ప్రశ్నించారు. దుబ్బాక బంద్ కు కూడా పిలుపునిచ్చారని ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందా అని ఆయన ఎలక్షన్ కమిషన్‌ను ప్రశ్నించారు. అమలైతే దుబ్బాకలో బీఆర్ఎస్ నేతలు ర్యాలీలు ఎలా తీశారని ప్రశ్నించారు. సెక్షన్ 30 యాక్ట్ కొందరికేనా? అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు 2+2 సెక్యూరిటీ నుంచి 4+4 కు సెక్యూరిటీని పెంచాలని అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్ నుంచి అన్ని జిల్లాల ఎస్పీలకు ఎలా ఆదేశాలిచ్చారని ఆయన నిలదీశారు. గతంలో తనకు సెక్యూరిటీ పెంచాలని డీజీపీని కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ కండువా ఉంటేనే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు న్యాయం జరగకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని రఘునందన్ రావు హెచ్చరించారు.+

Also Read..

కేసీఆర్ మనవడు హిమాన్షు కూడా ముఖ్యమంత్రి అవుతాడు: ఎంపీ 

BRS ఎంపీపై దాడి.. స్పందించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు 

Tags:    

Similar News