లక్ష ఉద్యోగాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు (వీడియో)
మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వద సభ నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వద సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. సబితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గర్వం లేదని వ్యాఖ్యానించారు. ఆమె తన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పని చేశారని, ఇలాంటి ఎమ్మెల్యేను ఇక్కడ ఇప్పటి వరకు చూడలేదు అని కేసీఆర్ ప్రశంసించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ఈ నియోజకవర్గంలో సబిత గెలుపు ఖాయమైపోయిందని జోస్యం చెప్పారు.
కందుకూరుకు మెడికల్ కాలేజీ వచ్చిదంటే సబిత ఇంద్రారెడ్డినే కారణం. పట్టుబట్టి మెడికల్ కాలేజీ తెప్పించుకున్నారు. మెడికల్ కాలేజీకి అనుంబధంగా 500 పడకల ఆస్పత్రి రాబోతోంది. స్థానికంగా ఉన్న వారికి ఇది ఎంతో ఉపయోగం. పారామెడికల్, నర్సింగ్ కాలేజీలు వస్తాయి. కందుకూరు మంచి హబ్‌గా మారబోతోంది. మెట్రో రైలు కందుకూరు దాకా రావాలని కేబినెట్ మీటింగ్‌లో పోరాటం చేశారు. తుక్కుగూడ ప్రాంతంలో 52 కొత్త పరిశ్రమలు వచ్చాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలోనే ఉంది. ఫ్యాక్స్ కాన్ ఇండస్ట్రీ వచ్చింది. లక్ష మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. చైనాలో ఉన్న పెద్ద కంపెనీ మూసుకుని ఇక్కడేకు వస్తాం.. కొంత జాగా ఇవ్వండని అంటున్నారు. అది ఆల్‌మోస్ట్ ఫైనల్ అయిపోతోంది దగ్గరపడ్డది. దీంతో 2, 3 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.