BRS పాలనతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది: భట్టి
రాష్ట్రంలో గడీల పాలన నుంచి విముక్తి కలగించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గడీల పాలన నుంచి విముక్తి కలగించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారికి భట్టి దంపతులు తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం ఆశీర్వచనం చేసి అమ్మవారి పసుపు, కుంకుమ, ప్రసాదాన్ని ఆలయ పండితులు అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రైతులు, పేదలకు మేలు జరగాలన్నారు. కేసీఆర్పాలనతో రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, బీఆర్ఎస్పార్టీకి చెక్పెట్టాలన్నారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలన్నారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్అధికారంలోకి రాబోతున్నదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డీసీసీ అనిల్ కుమార్‌యాదవ్ తదితరులు ఉన్నారు.