కాంగ్రెస్‌కు చెరుకు సుధాకర్ రాజీనామా
కాంగ్రెస్‌కు చెరుకు సుధాకర్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరు వల్లే తాను కాంగ్రెస్‌లో కొనసాగలేకపోతున్నానని రాజీనామా లేఖలో చెరుకు సుధాకర్ పేర్కొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత, డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన ఏ పార్టీలో చేరనున్నదీ క్లారిటీ ఇవ్వలేదు. కానీ రెండు మూడు రోజులుగా ఆయనను బీఆర్ఎస్‌లో చేర్చుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో లాంఛనంగా చేరే అవకాశం ఉందంటూ గులాబీ రాష్ట్ర నాయకులు వ్యాఖ్యానించారు. పార్టీలో సామాజిక న్యాయం లేదని, బీసీ వర్గాలకు తగిన అవకాశాలు లేవని, టికెట్ల కేటాయింపులో అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఉన్నదనే అసంతృప్తిని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి శుక్రవారం రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. తన రాజీనామాకు ఎంపీ కోమటిరెడ్డి తీరు కూడా కారణమని వెల్లడించారు.
ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఇదే జిల్లాకు చెందిన చెరుకు సుధాకర్ సైతం ఎంపీ కోమటిరెడ్డి తీరుపై విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా ఆత్మగౌరవం ఉండే, మెరుగ్గా ఉండే మరో వేదిక కోసం వెతుకులాడుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.