కేంద్రం కీలక నిర్ణయం.. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్‌లో ఇక మార్పులు మస్ట్!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించిన విషయం తెలిసిందే. మొత్తం 115 మందితో తొలి జాబితాను వెల్లడించారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు కేటాయించారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించిన విషయం తెలిసిందే. మొత్తం 115 మందితో తొలి జాబితాను వెల్లడించారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి సీట్లు కేటాయించారు. అయితే ఈ జాబితాలో కేవలం ఏడుగురు మహిళలకే అవకాశం కల్పించారు. దీంతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్సీ కవితపై విపక్షాల నుంచి సోషల్ మీడియా నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం కాదు.. ముందు మీ పార్టీలో మహిళలకు ఎన్ని సీట్లు కేటాయించారో చూడు’ అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు.. ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి తప్పించుకోవడానికి, ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి 33శాతం మహిళా రిజర్వేషన్ నినాదం ఎత్తుకుందని. ఢిల్లీ రిజర్వేషన్ పోరాటం పెద్ద డ్రామా అని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
ఇదిలా ఉండగా.. తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని ఇవాళ(మంగళవారం) సభలో ప్రవేశపెట్టనున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం తీసుకువస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించబడతాయి. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో ఇప్పటికే చాలా ప్లాన్‌లు వేసుకున్న చాలా రాష్ట్రాల లెక్కలు తారుమారు కానున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మార్పులు అనివార్యంగా మారింది. అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు అంటే దాదాపు 40 సీట్ల వరకు కేటాయించాల్సి ఉంది. దీంతో తప్పక బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్‌లో మార్పులు చేయాల్సి ఉంది.
కాగా, కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని హర్షం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్ కృషి ఉందన్నారు. మహిళా బిల్లకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సామాజిక మాధ్యమం (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఇది దేశంలోని ప్రతిఒక్క మహిళ విజయమన్నారు. దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే అసెంబ్లీలో 33 శాతం మహిళా రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్లను ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిందన్నారు. తొమ్మిదేండ్ల జాప్యం తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఓబీసీ, మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోడీకి లేఖలు రాశారని గుర్తుచేశారు. లోక్‌సభలో బీజేపీకి పూర్తిస్థాయి మెజారీటీ ఉండటంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ బిల్లును ఆమోదించేలా చూడాలని ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్ చేశారు. దీనిపై గులాబీ బాస్ ఏ విధంగా స్పందస్తారో చూడాలి.
Read More..
చంద్రబాబుకు బెయిలా..? లేక జైలేనా..? నేడే కీలకం.. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ