విజయభేరి సభ సక్సెస్‌తో టీ కాంగ్రెస్ దూకుడు.. 30 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్..
ఎన్నికలపై టీ కాంగ్రెస్ దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపికపై
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలపై టీ కాంగ్రెస్ దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది. మొన్నటివరకు సీడబ్ల్యూసీ సమావేశం, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తూ నేతలు బిజీబిజీగా ఉన్నారు. ఇటీవల సమావేశాలు ముగియడం, బహిరంగ సభ విజయవంతమైన నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. బుధ, గురువారాల్లో ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనుంది.
ఒకరి కంటే ఎక్కువమంది పోటీ లేని నియోజకవర్గాలకు ముందుగా అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇందులో భాగంగా మొత్తం 119 స్థానాల్లో తొలుత దాదాపు 30 స్థానాలకు అభ్యర్థులకు ఖరారు చేయనుంది. ఫిక్స్ చేసిన అనంతరం అభ్యర్థుల జాబితాను సీఈసీకి స్క్రీనింగ్ కమిటీ పంపనుంది. రేపటి సమావేశంలో మిగతా నియోజకవర్గాల అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయనుంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది.
రాష్ట్రంలో ఎన్నికలకు ఇప్పటికే ఈసీ ఏర్పాట్లు మొదలుపెట్టింది. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. దీంతో వీలైనంత త్వరగా అభ్యర్థులను ఫైనల్ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. దీని వల్ల ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుందని, అభ్యర్థులు కూడా ప్రజల్లోకి ఇప్పటినుంచే వెళ్లడం ద్వారా సానుకూలత లభిస్తుందని యోచిస్తోంది.