అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించడంపై కేడర్ సీరియస్

తెలంగాణ బీజేపీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు అధిష్టానం తీసుకన్న నిర్ణయంపై క్యాడర్ లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.

Update: 2023-07-04 13:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు అధిష్టానం తీసుకన్న నిర్ణయంపై క్యాడర్‌లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఎన్నికల వేళ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని కాదని కిషన్ రెడ్డిని నియమించడంపై తీవ్ర అంసతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు సీనియర్లే లోలోపల మండిపడుతుంటే ఇక పార్టీ కార్యకర్తలు సామాజిక మాద్యమాల ద్వారా తమ అసంతృప్తి, ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. ఎన్నికలకు ముందే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం అత్యంత బాధాకరం అని తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడంలో బండి సంజయ్ కృషి, సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని పలువురు బీజేపీ మద్దతుదారులు కామెంట్స్ చేస్తున్నారు.

రాష్ట్రంలో బీజేపీ అంటే బిఫోర్ బండి సంజయ్.. ఆఫ్టర్ బండి సంజయ్ అనేలా పార్టీ ఈ స్థాయికి తీసుకొచ్చారని అయితే బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ పుంజుకుంటున్న టైమ్‌లో ఆయనను తప్పించడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం ఉందనే తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయకుండా తాత్సారం చేస్తున్న అధిష్టానం అనూహ్యంగా బండి సంజయ్ పై నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు నడిపిన బండి సంజయ్ విషయంలో అధిష్టానం నిర్ణయం తమకు ఎంతో బాధ కలిగిస్తున్నా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మీరు చూపిన స్ఫూర్తితోనే పని చేస్తామంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయంలో పార్టీలోని సీనియర్ల రియాక్షన్ ఎలా ఉండబోతున్నదనేది ఉత్కంఠ రేపుతున్నది.

Read More..

సీఎం కేసీఆర్ మనవడిపై YS షర్మిల తీవ్ర విమర్శలు  

Tags:    

Similar News