కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌కు BIG షాక్

కామారెడ్డిలో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌కు మరో షాక్ తగిలింది. ఈసారి పౌల్ట్రీ రైతులు ట్విస్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కార్పొరేట్ శక్తుల తీరుతో అన్యాయానికి గురవుతున్నామని ఆవేదనతో 100కు పైగా నామినేషన్స్ వేయడానికి పూనుకున్నారు.

Update: 2023-11-02 13:02 GMT

దిశ, కామారెడ్డి: కామారెడ్డిలో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌కు మరో షాక్ తగిలింది. ఈసారి పౌల్ట్రీ రైతులు ట్విస్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కార్పొరేట్ శక్తుల తీరుతో అన్యాయానికి గురవుతున్నామని ఆవేదనతో 100కు పైగా నామినేషన్స్ వేయడానికి పూనుకున్నారు. ఇవాళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో పౌల్ట్రీ ఫార్మర్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో చికెన్ సెంటర్స్ అసోసియేషన్, ట్రేడర్స్ పాల్గొని పౌల్ట్రీ రైతులకు మద్దతు తెలిపారు. సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓన్ ఫార్మర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట్ రావు, ఇంటిగ్రేటెడ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ పౌల్ట్రీ శక్తుల తీరుతో పౌల్ట్రీ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.


కార్పొరేట్ శక్తులు ధరలు నిర్ణయించడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పౌల్ట్రీ రంగాన్ని పూర్తిగా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తున్నట్టుగానే పౌల్ట్రీ రంగానికి కూడా ఉచిత కరెంట్ సరఫరా చేయాలన్నారు. గ్రో ఇన్ ఛార్జెస్ ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. గతంలో సెంట్రల్ బోర్డు ద్వారా 50 శాతం సబ్సిడీ ఇచ్చేవారని, ప్రస్తుతం అదే విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న మక్కలు పౌల్ట్రీ రంగానికి 28 శాతం సబ్సిడీకి ఇవ్వాలన్నారు. పౌల్ట్రీ ధరలను రైతులే నిర్ణయించేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కామారెడ్డిలో 100 నామినేషన్లు వేయాలని నిర్ణయించామన్నారు. రేపటి నుంచి మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియలో విడతల వారిగా 100 నామినేషన్లు వేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విఠల్ రెడ్డి, చంద్రకాంత్, రాము, పౌల్ట్రీ రైతులు పాల్గొన్నారు.

Tags:    

Similar News