ఎన్నికల వేళ బీజేపీకి BIG షాక్.. కిషన్ రెడ్డికి కీలక నేత రాజీనామా లేఖ

ఎన్నికల వేళ బీజేపీకి సంగారెడ్డి జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే రాజీనామా చేశారు.

Update: 2023-11-16 10:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీజేపీకి సంగారెడ్డి జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి గురువారం పంపించారు. అనంతరం దేశ్ పాండే మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో బీజేపీకి ప్రాణం పోసిన తననే మోసం చేశారని ఆరోపించారు. పార్టీ అధ్యక్ష పదవికి కిషన్ రెడ్డి అనర్హుడని విమర్శించారు. బ్రాహ్మణ కులాన్ని కించపరిచేలా ఈటల రాజేందర్ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఉన్నంత వరకు బీజేపీ బాగుపడదని సీరియస్ కామెంట్స్ చేశారు.



 


Tags:    

Similar News